• India
homepagebanner
homepagebanner
homepagebanner
  • Police : 9440796632, 33, 34
  • Ambulance : 108
  • Fire-Brigade : 08816 233299
  • Municipal Corporation : 98499 05813
  • Blood Bank : 08816 225559
గ్యాంగ్ లీడర్ సినిమా రివ్యూ  (13/9/19)
Entertainment

గ్యాంగ్ లీడర్ సినిమా రివ్యూ (13/9/19)

భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (13/9/19..     4.00pm)

పెన్సిల్ పార్ధ సారథి (నాని) సినిమాలు చూసి క్రైమ్ నవల్స్ రాస్తూ ఉంటాడు. అయితే ఈ క్రమంలో అతని దగ్గరకి ఓ ఐదుగురు ఆడవాళ్లు ఓ వ్యక్తిని చంపాలని.. దానికి సాయం చేయాలని కోరతారు. ఆ తరువాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం ఆ ఆడవాళ్ల గ్యాంగ్ లీడర్ గా నాని మారతాడు. ఈ గ్యాంగ్ అంతా కలిసి ఆ వ్యక్తి కోసం వెతికే క్రమంలో.. తాము చంపాలని తిరుగుతున్న వ్యక్తే దేవ్ (కార్తికేయ) అని తెలుసుకుంటారు. దాంతో దేవ్ ని చంపడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. ఇంతలో నాని ఆ గ్యాంగ్ లోని ప్రియా (ప్రియాంక అరుల్ మోహన్)తో ప్రేమలో పడతాడు. అసలు వీళ్ళు దేవ్ ని ఎందుకు చంపాలనుకుంటున్నారు? దేవ్ కి వీళ్ళకి సంబంధం ఏమిటి ? చివరికి దేవ్ ని చంపారా? లేదా? ఇంతకీ నాని ఆ ఆడవాళ్లకి ఎందుకు సాయం చేస్తున్నాడు ? లాంటి విషయాలు తెలుసుకోవాలంటే ఈ చిత్రాన్ని వెండితెర పై చూడాల్సిందే. ప్లస్ పాయింట్స్ : పర్ఫెక్ట్ హిట్ కోసం నాని ఎంచుకున్న ఈ ‘గ్యాంగ్ లీడర్’ రివేంజ్ కామెడీ డ్రామాగా సాగుతూ ఆకట్టుకుంటాడు. ముఖ్యంగా సినిమాలో లక్ష్మీ, శరణ్య, ప్రియాంక తదితరులతో కూడిన గ్యాంగ్‌ తో నాని చేసిన సీన్స్‌ చాలా ఎంటర్‌టైనింగ్‌ గా సాగుతాయి. అలాగే క్లైమాక్స్ లో నాని, కార్తికేయతో చేసిన యాక్షన్‌ సీక్వెన్స్‌ కూడా ఎక్స్‌ట్రార్డినరీగా ఉంది. ఇక మ్యూజిక్ సంచలనం అనిరుధ్ ఈ సినిమాకి అందించిన సంగీతం మరియు హీరోహీరోయిన్లు మధ్య కెమిస్ట్రీ అలాగే ఓపెనింగ్ యాక్షన్ సన్నివేశంబాగా ఆకట్టుకుంటాయి.  పెన్సల్ పార్ధ సారథి అనే పాత్రలో నాని తన పాత్రకు తగ్గట్లు… తన రియలిస్టిక్ యాక్టింగ్ తో ఆకట్టుకుంటూ సినిమాకే హైలెట్ గా నిలిచాడు. కొన్ని కీలక సన్నివేశాలతో పాటు హీరోయిన్ తో సాగే లవ్ ట్రాక్ లో గాని, క్లైమాక్స్ సన్నివేశంలో గాని అలాగే కొన్ని కామెడీ సన్నివేశాల్లో తన కామెడీ టైమింగ్ తో నాని అద్భుతంగా నటించాడు. ప్రియాంక అరుల్ మోహన్ కొన్ని లవ్ సీన్స్ లో అవలీలగా నటించడంతో పాటు అందంగా కనిపిస్తూ ఆకట్టుకుంది. అలాగే రేసర్ గా కనిపించిన కార్తికేయ కూడా బాగా నటించాడు. లక్ష్మీ, శరణ్య.. అలాగే ఇతర పాత్రల్లో కనిపించిన మిగిలిన నటీనటులు వెన్నెల కిషోర్ కూడా తమ నటనతో ఆకట్టుకున్నారు. మైనస్ పాయింట్స్:

 
దర్శకుడు సినిమాని ఇంట్రస్టింగ్ గా మొదలు పెట్టినా.. ఆ తరువాత కొన్ని చోట్ల కథనం నెమ్మదిగా సాగుతుంది. ఫస్టాఫ్ లోని ఆ కొన్ని ల్యాగ్ సీన్స్ ను కూడా తగ్గించి ఉంటే సినిమా ఇంకా అద్భుతంగా వచ్చి ఉండేది. దర్శకుడు రాసుకున్న ట్రీట్మెంట్, ప్రేమ సన్నివేశాలు ఆకట్టుకున్నప్పటికీ.. కొన్ని కీలక సీన్స్ లో లాజిక్ మిస్ అవ్వడం, అలాగే కొన్ని సన్నివేశాల్లో ఇంట్రస్ట్ మిస్ అవ్వడం వంటి అంశాలు మైనస్ పాయింట్స్ గా నిలుస్తాయి. దీనికి తోడు సెకెండ్ హాఫ్ స్లోగా సాగుతూ అక్కడక్కడ బోర్ కొడుతోంది.

You can share this post!

Wonderful Outdoors Experience: Eagle Spotting in Alaska

The only thing that overcomes hard luck is hard work