• India
homepagebanner
homepagebanner
homepagebanner
  • Police : 9440796632, 33, 34
  • Ambulance : 108
  • Fire-Brigade : 08816 233299
  • Municipal Corporation : 98499 05813
  • Blood Bank : 08816 225559
మహాలక్ష్మి అలంకరణలో మావుళ్ళమ్మ .. ధనలక్ష్మి అలంకరణలో అమ్మవార్లు  (4/10/19)
Endowment

మహాలక్ష్మి అలంకరణలో మావుళ్ళమ్మ .. ధనలక్ష్మి అలంకరణలో అమ్మవార్లు (4/10/19)

భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (04/10/19.. 10.30am)

         భీమవరం శ్రీమావుళ్ళమ్మ అమ్మవారిని దేవి శరన్నవరాత్రి మహోత్సవ వేడుకల్లో భాగంగా శుక్రవారం  భక్తులకు మహాలక్ష్మిదేవిగా దర్శనమిచ్చారు. ఆలయ ఈవో దాసరి శ్రీరామ వరప్రసాదరావు పర్యవేక్షణలో ఆలయ అర్చకులు కొడమంచిలి సుబ్రహ్మణ్య శర్మ, మద్దిరాల మల్లిఖార్జున శర్మ, ఈమని రామచంద్ర ఘనాపాటి ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణంలో అమ్మవారికి లక్ష కుంకుమార్చన, చండీహోమం సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. 5న సర్వస్వతిదేవి అమ్మవారిగా అలంకరణ చేస్తామని ఆలయ ఈవో వరప్రసాదరావు తెలిపారు.  అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు.  

                   గునుపూడి లోని శ్రీ ఆదిలక్ష్మి రాజ్యలక్ష్మి పోలేరమ్మ దేవస్థానంలో దేవి శరన్నవరాత్రి మహోత్సవంలో భాగంగా ధనలక్ష్మి దేవిగా అలంకరణ చేశారు. ఆలయ ఈవో పాట శ్రీనివాసరావు పర్యవేక్షణలో ఆలయ అర్చకులు ఆధ్వర్యంలో భక్తులచే అమ్మవారికి సహస్ర నామ కుంకుమార్చన నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు.

                     దేవిశరన్నవరాత్రి మహోత్సవ వేడుకల్లో భాగంగా పట్టణంలోని పలు దేవాలయాల్లోని అమ్మవార్లను  మహాలక్ష్మిదేవిగా అలంకరణ చేశారు. శ్రీరాంపురం రోడ్డులోని వేంచేసి ఉన్న శ్రీజగన్మాత కనకదుర్గ  అమ్మవారిని గాయత్రీదేవిగా అలంకరణ చేశారు. పెయింటర్ అండ్ ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు బ్రహ్మ జోస్యుల ప్రసాదు సుబ్రహ్మణ్యం పర్యవేక్షణలో అమ్మవారికి లక్ష కుంకుమార్చన నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు.

                   భీమవరం శ్రీభీమేశ్వర స్వామి దేవస్థానంలోని శ్రీ మహిషాసుర మర్దిని అమ్మవారిని దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా మహాలక్ష్మిదేవిగా అలంకరణ చేశారు. ఆలయ ఈవో తోట శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి లక్ష కుంకుమార్చన చేశారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు.

             పంచారామ క్షేత్రం అయిన శ్రీఉమా సోమేశ్వర జనార్ధన స్వామి దేవస్థానంలోని పార్వతి అమ్మవారిని దేవి శరన్నవరాత్రి మహోత్సవంలో భాగంగా లలితాత్రిపుర సుందర్ దేవిగా అలంకరణ చేశారు. ఆలయ ఈవో అరుణ్ కుమార్ పర్యవేక్షణలో ఆలయ అర్చకులు చెరుకూరి రామకృష్ణ ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు.  

You can share this post!

Wonderful Outdoors Experience: Eagle Spotting in Alaska

The only thing that overcomes hard luck is hard work