• India
homepagebanner
homepagebanner
homepagebanner
  • Police : 9440796632, 33, 34
  • Ambulance : 108
  • Fire-Brigade : 08816 233299
  • Municipal Corporation : 98499 05813
  • Blood Bank : 08816 225559
భీమవరంలో రౌడీ షీటర్‌ దారుణ హత్య (2/10/19)
Crime

భీమవరంలో రౌడీ షీటర్‌ దారుణ హత్య (2/10/19)

భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (02/10/19.. 10.00pm)

రౌడీషీటర్‌ను పక్కా ప్లాన్‌తో కాపుకాసి కొందరు దుండగులు అత్యంత దారుణంగా హతమార్చారు. ఈ సంఘటన బుధవారం రాత్రి భీమవరం పట్టణంలో సంచలనమైంది. దీనిపై భీమవరం వన్‌టౌన్‌ ఎస్‌ఐ కె శ్రీనివాసరావు తెలిపిన వివరాలివి.. పట్టణానికి చెందిన కొప్పిరెడ్డి నరసింహమూర్తి(ముసిలి)(45) కొంత కాలంగా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతనిపై గతంలో రెండు హత్య కేసులు కూడా ఉన్నాయి. ముసిలిపై గతంలో రెండు హత్య కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో రౌడీషీట్‌ కొనసాగుతుందని ఎస్‌ఐ శ్రీనివాస్‌ పేర్కొన్నారు. గతం నుంచి ముసిలి పలు వివాదా ల్లో ఉండడంతో ప్రస్తుతం హత్యకు అదే కారణమా లేక మరేదైనా కారణమా అనేది ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అత ను వన్‌టౌన్‌ శివారులోని సెయింట్‌ ఆన్స్‌ స్కూల్‌ సమీపంలో నిర్మించుకున్న ఒక దేవాలయం వద్ద రక్తపు మడుగులో పడి ఉండడంపై ఈ హత్య పక్కా ప్లాన్‌తోనే జరిగిందా అనే విషయం చర్చనీయాంశమైంది. ప్రస్తుతానికి పోలీసులు వివరాలు సేకరిస్తు న్నారు. పూర్తి వివరాలను గురువారం వెల్లడిస్తామని తెలిపారు. కొప్పిరెడ్డి నరసింహమూర్తి(ముసిలి)ని హత మార్చడానికి గల కారణాలు పలు రకాలుగా వినిపిస్తున్నాయి. ఇటీవల కాలంలో ముసిలి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలో ముందంజలో ఉండడంపై పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందరితోను నవ్వుతూ పలకరిస్తూ ముందుకు వెళ్లే ముసిలిని హత్య చేయడానికి ఎవరు పన్నాగం పన్నారు.. అసలు ఏం జరిగింది అనేది ప్రశ్నార్థకంగా మారింది. సాయంత్రం పూట 6 గంటల సమయంలో హత్య జరగడంతో అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు. ముసిలి నిర్మించుకున్న దేవాలయంలో కొన్ని నివాసాలు కూడా ఉన్నప్పటికి ఈ ఉదంతం జరగడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

You can share this post!

Wonderful Outdoors Experience: Eagle Spotting in Alaska

The only thing that overcomes hard luck is hard work