• India
homepagebanner
homepagebanner
homepagebanner
  • Police : 9440796632, 33, 34
  • Ambulance : 108
  • Fire-Brigade : 08816 233299
  • Municipal Corporation : 98499 05813
  • Blood Bank : 08816 225559
పవన్ కళ్యాణ్ ముమ్మాటికీ చంద్రబాబుకు దత్తపుత్రుడే .. ఎమ్మెల్యే గ్రంధి (4/11/19)
General

పవన్ కళ్యాణ్ ముమ్మాటికీ చంద్రబాబుకు దత్తపుత్రుడే .. ఎమ్మెల్యే గ్రంధి (4/11/19)

భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (04/11/19. 04.30am)

ముమ్మాటికీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు దత్తపుత్రుడేనని, ప్రజలకు వాస్తవాలు చెప్పడం మానేసి రాజకీయ ప్రయాజనాల కోసం కవాతులు చేయడం సరికాదని ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ విమర్శించారు. భీమవరంలో సోమవారం తన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో అయన మాట్లాడారు. గోదావరి పరిస్థితి తెలియకుండా పవన్ ఇసుక కవాతు చేయడం వెనుక చంద్రబాబు ఉన్నారని ఆరోపించారు. అందుకే విశాఖలో జరిగిన కవాతులో వామపక్షాలు బిజెపి ఇతర పార్టీల నాయకులూ లేరని, కేవలం టిడిపి నేతలు మాత్రమే ఉన్నారని అన్నారు. సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నానని చెప్పే పవన్ వ్యాఖ్యలో ఏ మాత్రం వాస్తవం లేదన్నారు. చెప్పేదొకటి చేసేదొకటి అన్నట్లుగా పవన్ వ్యవహరిస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి జగన్ పాలనలో రాష్ట్రము అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని, ఇందులో ఎటువంటి సందేహం లేదన్నారు. 

You can share this post!

Wonderful Outdoors Experience: Eagle Spotting in Alaska

The only thing that overcomes hard luck is hard work