• India
homepagebanner
homepagebanner
homepagebanner
  • Police : 9440796632, 33, 34
  • Ambulance : 108
  • Fire-Brigade : 08816 233299
  • Municipal Corporation : 98499 05813
  • Blood Bank : 08816 225559
మహిళా తహసీల్దార్‌ విజయారెడ్డి సజీవదహనం (5/11/19)
General

మహిళా తహసీల్దార్‌ విజయారెడ్డి సజీవదహనం (5/11/19)

భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (05/11/19.    09.30am)

అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దార్‌ కార్యాలయ భవనం కింద సెల్లార్‌లో దుకాణాలు, మొదటి అంతస్తులో తహసీల్దార్‌ చాంబర్‌ ఉంది. ఉదయం నుంచీ రైతులు, భూ బాధితులు, ఇతర రెవెన్యూ సమస్యలున్న వ్యక్తులు అక్కడికి వచ్చారు. మధ్యాహ్నం 2:30 గంటలకు భోజన విరామ సమయం. సిబ్బంది అంతా భోజనం చేస్తున్నారు. తహసీల్దార్‌ విజయారెడ్డి కూడా తన చాంబర్లో భోజనం చేస్తున్నారు. ఆ సమయంలో కార్యాలయంలో జనసంచారం తక్కువగా ఉంది. సరిగ్గా, ఆ సమయంలోనే కౌలు రైతు సురేశ్‌ కార్యాలయంలోకి ప్రవేశించాడు. నేరుగా తహసీల్దార్‌ చాంబర్‌లోకి వెళ్లాడు. ‘నా భూమి నాకు కాకుండా అడ్డుపడుతున్నావు’ అంటూ ఆగ్రహంగా ఊగిపోతూ ఆమెతో వాదనకు దిగాడు. తన వెంట తెచ్చిన పెట్రోల్‌ను ఆమెపై కుమ్మరించాడు. అంతటితో ఆగకుండా.. కింద నుంచి కూడా ఆమె కాళ్లకు తగిలేలా చల్లాడు. సిగరెట్‌ వెలిగించుకునేందుకు ఉపయోగించే లైటర్‌తో క్షణాల్లో నిప్పంటించాడు. క్షణాల్లోనే ఆమె ఒళ్లంతా మంటలు అంటుకున్నాయి. మంటల ధాటికి తట్టుకోలేక తహసీల్దార్‌ హాహాకారాలు చేస్తూ సీటులోంచి లేచి పరుగు తీయడానికి ప్రయత్నించారు. కానీ, అప్పటికే సురేశ్‌ చాంబర్‌కు లోపలి నుంచి గడియ పెట్టి అక్కడే ఉన్నాడు. ఆమె పూర్తిగా కాలిపోయేంత వరకూ అక్కడే ఉన్నాడు. ఈలోగా అతనికి కూడా మంటలు అంటుకున్నాయి. దాంతో, గడియ తీసి బయటకు పరుగులు తీశాడు. ఒళ్లంతా మంటలు అలముకున్న విజయా రెడ్డి చాంబర్‌ నుంచి బాల్కనీలోకి వచ్చి మంటల తీవ్రత తట్టుకోలేక అరుస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. క్షణాల్లోనే శరీరం మొత్తం కాలిపోయి ఘటనా స్థలంలోనే విజయా రెడ్డి మృతి చెందారు. మంటల్ని ఆర్పే క్రమంలో డ్రైవర్‌ కామల్ల గురునాథానికి 85%, అటెండర్‌ చంద్రయ్యకు 40% గాయాలయ్యాయి. మెరుగైన చికిత్స అందించేందుకు వారిని డీఆర్‌డీవో అపోలో ఆస్పత్రికి తరలించారు. వీరిలో గరునాథ్‌ రెడ్డి పరిస్థితి విషమంగా ఉంది. సూర్యాపేట జిల్లా వెల్దండ గ్రామానికి చెందిన ఆయనకు భార్య సౌందర్య, కుమారుడు మల్లికార్జున్‌ (2) ఉన్నారు. ఎల్బీనగర్‌లోని మన్సూరాబాద్‌లో నివాసం ఉంటున్న గురునాథం భార్య ప్రస్తుతం గర్భవతి. అలాగే, శంషాబాద్‌ మండలం రాళ్లగూడకు చెందిన అటెండరు చంద్రయ్యకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

You can share this post!

Wonderful Outdoors Experience: Eagle Spotting in Alaska

The only thing that overcomes hard luck is hard work