• India
homepagebanner
homepagebanner
homepagebanner
  • Police : 9440796632, 33, 34
  • Ambulance : 108
  • Fire-Brigade : 08816 233299
  • Municipal Corporation : 98499 05813
  • Blood Bank : 08816 225559
  డిజిటల్‌ లావాదేవీలపై ఛార్జీలు వద్దు!  (4/6/19)
Realestate

డిజిటల్‌ లావాదేవీలపై ఛార్జీలు వద్దు! (4/6/19)

భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (4/6/19.. 04.30pm)

డిజిటల్ చెల్లింపుల ప్రోత్సాహానికి నందన్‌ నీలేకని నేతృత్వంలోని కమిటీ పలు సిఫారసులు చేసింది. ఛార్జీలను ఎత్తివేయడం, ఎల్లవేళలా ఆర్‌టీజీఎస్‌, నెఫ్ట్‌ సదుపాయం అందుబాటులో ఉండేలా చూడటం, పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ (పీఓఎస్‌) యంత్రాల దిగుమతులపై సుంకాల తొలగింపు లాంటివి ఇందులో కొన్ని. ఈ సిఫారసులతో కూడిన నివేదికను గత నెలలో ఆర్‌బీఐ గవర్నరు శక్తికాంత దాస్‌కు కమిటీ అందజేసింది. ఆ నివేదికను ఆర్‌బీఐ విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం.. ప్రభుత్వ ఏజెన్సీలకు వినియోగదారులు చేసే చెల్లింపులపై కన్వీనెన్స్‌ ఛార్జీలు ఉండకూడదని కూడా కమిటీ సూచించింది. ఆన్‌లైన్‌ ద్వారా ఫిర్యాదుల పరిష్కారానికి వ్యవస్థల ఏర్పాటుకు సిఫారసు చేసింది. ‘డిజిటల్‌ చెల్లింపుల వ్యవస్థలను పర్యవేక్షించేందుకు తగిన వ్యవస్థలను ప్రభుత్వం, ఆర్‌బీఐ ఏర్పాటు చేయాలి. నెలవారీగా డిజిటల్‌ సంస్థలన్నింటికీ పిన్‌కోడ్‌ సహా ఇతరాత్ర సమాచారాన్ని అందుబాటులో ఉంచాలి. అప్పుడే తగువిధంగా అవసరమైన సర్దుబాట్లను అవి చేసుకుంటాయ’ని నివేదిక పేర్కొంది. గత ఐదేళ్లలో ప్రధాన్‌ మంత్రి జన్‌ధన్‌యోజన కింద భారత్‌లో కొత్తగా చాలా మంది బ్యాంకింగ్‌ సేవల పరిధిలోకి వచ్చారని తెలిపింది. ప్రత్యక్ష నగదు బదిలీ, ప్రభుత్వ చెల్లింపుల డిజటలీకరణ ద్వారా బ్యాంకు ఖాతాల్లోకి డిజిటల్‌ రూపేణా పెద్ద మొత్తంలో నగదు జమ నమోదైందని వెల్లడించింది. 100 కోట్ల డెబిట్‌ కార్డులు, 5 కోట్ల క్రెడిట్‌ కార్డులను బ్యాంకులు జారీ చేశాయని తెలిపింది. మరోవైపు డిజిటల్‌ చెల్లింపులకు మౌలిక వసతుల పరంగా పురోగతి ఇప్పటికీ అంతంతమాత్రంగానే ఉందని నివేదిక గుర్తించింది. కార్డుల ద్వారా లావాదేవీలకు ప్రస్తుతం దాదాపు 35 లక్షల పీఓఎస్‌ యంత్రాలు, 2 లక్షల ఏటీఎంలు మాత్రమే అందుబాటులో ఉన్నాయని తెలిపింది. కార్డు చెల్లింపులపై ఇంటర్‌ఛేంజ్‌ రుసుములను 15 బేసిస్‌ పాయింట్లు తగ్గించాలని కూడా పేర్కొంది. నిర్ణీత సంఖ్యలో డిజిటల్‌ చెల్లింపుల లావాదేవీలపై ఎటువంటి రుసుమలు విధించకూడదని తెలిపింది. ‘శాఖలు, ఏటీఎంలు, నెట్‌ బ్యాంకింగ్‌ ద్వారా లావాదేవీలను ఉచిత రుసుముతో అందజేస్తున్నాయి. వినియోగదారుల సేవల కిందనే ఈ సేవలను చూస్తున్నాయి. డిజిటల్‌ లావాదేవీల విషయంలోనూ ఈ తరహా విధానాన్ని అనుసరించాల’ని నివేదిక పేర్కొంది. ఆర్‌టీజీఎస్‌, నెఫ్ట్‌ సేవలను రోజు మొత్తంలో అందుబాటులో ఉండేలా చూడాలని కూడా తెలిపింది. పీఓఎస్‌ యంత్రాల దిగుమతులపై ప్రస్తుతం 18 శాతం సుంకం విధిస్తున్నారు. అయితే దేశంలో పూర్తి స్థాయిలో మౌలిక వసతులు అందుబాటులో వచ్చే వరకు అంటే కనీసం మూడేళ్ల పాటు పీఓఎస్‌ దిగుమతులపై సుంకం మినహాయింపును ఇవ్వాలని పేర్కొంది. రూపే, భీమ్‌ యూపీఐ లాంటి భారత చెల్లింపు వ్యవస్థలను అంతర్జాతీయంగా కూడా అందుబాటులోకి తెచ్చే ప్రణాళికను ప్రతిపాదించింది. తక్కువ విలువ లావాదేవీలపై (రూ.2000 లోపు) మర్చంట్‌ డిస్కౌంట్‌ రేట్‌ రిఫండ్‌ స్కీమ్‌ను మరో రెండేళ్ల పాటు పొడిగించాలని నివేదిక పేర్కొంది. డిజిటల్‌ చెల్లింపుల ప్రోత్సాహానికి, డిజిటలీకరణ ద్వారా బ్యాంకింగ్‌ సేవల విస్తరణకు సిఫారసులు చేసే నిమిత్తం జనవరిలో ఐదుగురు సభ్యులతో ఆర్‌బీఐ ఈ కమిటీని ఏర్పాటు చేసింది.

 

You can share this post!

Wonderful Outdoors Experience: Eagle Spotting in Alaska

The only thing that overcomes hard luck is hard work