• India
homepagebanner
homepagebanner
homepagebanner
  • Police : 9440796632, 33, 34
  • Ambulance : 108
  • Fire-Brigade : 08816 233299
  • Municipal Corporation : 98499 05813
  • Blood Bank : 08816 225559
వచ్చే ఏడాది మహీంద్రా బీఎస్‌-6 వాహనాలు  (4/6/19)
Realestate

వచ్చే ఏడాది మహీంద్రా బీఎస్‌-6 వాహనాలు (4/6/19)

భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (4/6/19.. 04.30pm)

మహీంద్రా అండ్ మహీంద్రా భారత్‌ స్టేజ్‌-6 నిబంధనలకు అనుగుణంగా వాహనాల మోడల్స్‌ను వచ్చే ఏడాది రెండో త్రైమాసికంలో మార్కెట్లోకి ప్రవేశపెడతామని సంస్థ ఎండీ పవన్‌ గోయంకా తెలిపారు. కొత్త నిబంధలు డీజిల్‌ వాహనాలను మరింత ప్రియం చేయనున్నాయని ఆయన  వ్యాఖ్యానించారు. 2020 ఏప్రిల్‌ 1 నాటికి పెట్రోల్‌, డీజిల్‌ రకాల వాహనాలు సిద్ధమైపోతాయని తెలిపారు. నాలుగు మీటర్లకు మించి పొడవు ఉన్న వాహనాలపై 50శాతం వరకు జీఎస్‌టీ పెరగవచ్చని.. ఈ పెంపు రూ.లక్షల వరకు ఉంటుందని గోయంకా తెలిపారు. చిన్న డీజిల్‌ వాహనాలపై  రూ.80,000 వేల వరకు పెరుగుదల ఉంటుందని పేర్కొన్నారు. ఇక పెట్రోల్‌ మోడల్స్‌పై రూ20 వేల నుంచి రూ.25 వేల వరకు పెరుగుదల ఉండవచ్చన్నారు. బీఎస్‌6 మోడల్‌ కేయూవీ 100 డీజిల్‌ మోడల్‌ లాభదాయకతపై  సందేహాలు ఉండటంతో దీని కొనసాగింపుపై కంపెనీ మల్లగుల్లాలు పడుతోంది.  ఇటీవల కాలంలో పెట్రోల్‌ వాహనాలకు కూడా డిమాండ్‌ పెరుగుతుండటం కూడా దీనికి మరో కారణం. మహీంద్రా సంస్థ ఇప్పటికే మూడున్నరేళ్లలో కొత్త ఇంజిన్ల అభివృద్ధికి రూ.1000 కోట్లు ఖర్చపెట్టింది. 11 ప్రదేశాల్లో 136 వాహనాలను 69 లక్షల కిలోమీటర్లు తిప్పి పరీక్షలు నిర్వహించింది. కొత్తగా 8 ఇంజిన్లను, 1,482 విడిభాగాలను అభివృద్ధి చేసి 30 పేటేంట్లకు దరఖాస్తు చేసింది.

 

You can share this post!

Wonderful Outdoors Experience: Eagle Spotting in Alaska

The only thing that overcomes hard luck is hard work