• India
homepagebanner
homepagebanner
homepagebanner
  • Police : 9440796632, 33, 34
  • Ambulance : 108
  • Fire-Brigade : 08816 233299
  • Municipal Corporation : 98499 05813
  • Blood Bank : 08816 225559
  రెడ్‌మీ K20, K20 ప్రో వచ్చేస్తున్నాయ్‌  (4/6/19)
Realestate

రెడ్‌మీ K20, K20 ప్రో వచ్చేస్తున్నాయ్‌ (4/6/19)

భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (4/6/19.. 04.30pm)

షామీ నుంచి ఓ కొత్త ఫోన్‌ వస్తోందంటే చాలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తుంటారు టెక్ ; ప్రియులు. అందులోనూ ఇటీవల ఆ కంపెనీ సబ్‌ బ్రాండ్‌ అయిన రెడ్‌మీ ఓ ప్రీమియం ఫోన్‌ తీసుకొస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. k20, k20 ప్రో పేరిట ఇప్పటికే చైనాలో విడుదలైన ఈ ఫోన్లను భారత మార్కెట్‌లోకి తీసుకొస్తామని ఇది వరకే  ఆ కంపెనీ ప్రకటించినా ఎప్పుడనేది తెలియరాలేదు. ఇప్పుడు ఆ ఉత్కంఠకు తెరపడింది. ఈ రెండు ఫోన్లను జులై నెలలో విడుదల చేస్తామని ఆ కంపెనీ ఇండియా చీఫ్‌ మను కుమార్‌ జైన్‌ ప్రకటించారు. ఈ మేరకు ట్వీట్‌ చేశారు. మరో ఆరు వారాల్లో (జులై మధ్యలో) ఈ ఫోన్లను తీసుకొస్తామని పేర్కొన్నారు. అంతకుమించి వివరాలేవీ వెల్లడించలేదు. భారత్‌లో ఆ కంపెనీకి ఉన్న పోటీ దృష్ట్యా వీటి ధరలను కాస్త తక్కువగానే ప్రకటించే అవకాశం ఉంది. అయితే ఎంత ధర ఉంటుందనేది మాత్రం తెలియరాలేదు. చైనాలోని ధరలతో పోల్చి చూసినప్పుడు k20 ప్రో ధరలు ఇలా ఉండనున్నాయి. 6జీబీ+ 64జీబీ వేరియంట్‌ ధర రూ.25,000, 6జీబీ+ 128 జీబీ వేరియంట్ రూ.26,000 ఉండే అవకాశం ఉంది. ఇక 8జీబీ+ 128 జీబీ వేరియంట్‌ ధర రూ.28,000, 8జీబీ+ 256 జీబీ వేరియంట్‌ ధర రూ.30,000 ఉండనున్నాయి. ఇక K20 మోడల్‌ ధరలు ఈ విధంగా ఉండనున్నాయి. 6జీబీ+64జీబీ, 6జీబీ+ 128జీబీ, 8జీబీ+ 256 జీబీ ధరలు వరుసగా.. రూ.20వేలు, రూ.21వేలు, రూ.26 వేలుగా ఉండే అవకాశం ఉంది. ఈ ఫోన్లు ఇదే పేరుతో భారత్‌లో విడుదల కానున్నాయి. అంతకుముందు వీటిని పోకో F2, పోకో F2 ప్రో పేరుతో తీసుకొచ్చే అవకాశం ఉందని వార్తలు వినిపించాయి. K20 ఫీచర్లు.. ప్రో ఫీచర్లు.. 18px;">6.39 అంగుళాల తెర

 
స్నాప్‌డ్రాగన్‌ 730 ప్రాసెసర్‌
 
20మెగా పిక్సల్‌ ఫ్రంట్‌ కెమెరా
 
48+8+13 ఎంపీ వెనుక కెమెరాలు
 
4000 ఎంఏహెచ్‌ బ్యాటరీ
 
ఆండ్రాయిడ్‌ పై ఓఎస్‌తో ఈ ఫోన్‌ రానుంది.
 
6.39 అంగుళాల తెర
 
స్నాప్‌డ్రాగన్‌ 855 ప్రాసెసర్‌
 
20మెగా పిక్సల్‌ ఫ్రంట్‌ కెమెరా
 
48+8+13 ఎంపీ వెనుక కెమెరాలు
 
4000 ఎంఏహెచ్‌ బ్యాటరీ
 
ఆండ్రాయిడ్‌ పై ఓఎస్‌తో ఈ ఫోన్‌ పనిచేయనుంది
 
ఈ రెండు ఫోన్లు పాప్‌ అప్‌ కెమెరాతో పాటు ఇన్‌ డిస్‌ప్లే ఫింగర్‌ ఫ్రింట్‌ స్కానర్లతో రానున్నాయి.

You can share this post!

Wonderful Outdoors Experience: Eagle Spotting in Alaska

The only thing that overcomes hard luck is hard work