• India
homepagebanner
homepagebanner
homepagebanner
  • Police : 9440796632, 33, 34
  • Ambulance : 108
  • Fire-Brigade : 08816 233299
  • Municipal Corporation : 98499 05813
  • Blood Bank : 08816 225559
భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి నేటికీ 70 ఏళ్ళు పూర్తి ..   (26/11/19)
Educational

భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి నేటికీ 70 ఏళ్ళు పూర్తి .. (26/11/19)

భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (26/11/19. 03.30pm)

            భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి నేటికీ 70 ఏళ్ళు పూర్తి అయ్యిందని, 1949 నవంబర్ 26న రాజ్యాంగానికి రాజ్యసభ ఆమోదం తెలిపిందని, ప్రతి ఏటా నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంటున్నామని ఆదిత్య డిగ్రీ కళాశాల డైరెక్టర్ ఎం శ్రీనివాస్, ప్రిన్సిపాల్ ఏ అనురాధ అన్నారు. కళాశాలలో మంగళవారం రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ రాజ్యాంగ స్ఫూర్తికి మనందరం పునరంకితం కావాలని, రాజ్యాంగం మనకు సంపూర్ణమైన స్వేచ్ఛను ఇచ్చిందని, బిఆర్ అంబేద్కర్ ని స్మరించుకోవడం మనందరి కర్తవ్యమని అన్నారు. కార్యక్రమంలో కళాశాల ఏవో వి దొరబాబు, బి మావుళ్లు, లక్ష్మీసుధ విద్యార్థులు పాల్గొన్నారు.    

              భారతదేశ సామాజిక ఆర్ధిక రాజకీయా పరిస్థితులకు అనుగుణంగా బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని భారతదేశ ప్రజలు ఆమోదించిన రోజని విష్ణు ఇనిస్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ డైరెక్టర్, ప్రిన్సిపాల్ దశిక సూర్యనారాయణ అన్నారు. కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో మంగళవారం కళాశాలలో రాజ్యాంగ దినోత్సవ విశిష్టత అనే అంశంపై అవగహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ కె శ్రీనివాస్, అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు. 

 

You can share this post!

Wonderful Outdoors Experience: Eagle Spotting in Alaska

The only thing that overcomes hard luck is hard work