• India
homepagebanner
homepagebanner
homepagebanner
  • Police : 9440796632, 33, 34
  • Ambulance : 108
  • Fire-Brigade : 08816 233299
  • Municipal Corporation : 98499 05813
  • Blood Bank : 08816 225559
జాతీయస్థాయి బాలలసైన్స్ కాంగ్రెస్ పోటిలకు కాకతీయ విద్యార్థులు ఎంపిక (27/11/19)
Educational

జాతీయస్థాయి బాలలసైన్స్ కాంగ్రెస్ పోటిలకు కాకతీయ విద్యార్థులు ఎంపిక (27/11/19)

భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (27/11/19.. 04.30pm)

వచ్చేనెల 27 నుంచి 31వ తేదీ వరకు తిరువనంతపురంలో జరిగే జాతీయ స్థాయి బాలల సైన్స్ కాంగ్రెస్ పోటీలకు భీమవరం శ్రీకాకతీయ మెరిట్ స్కూల్ విద్యార్థులు ఎంపికైయ్యారని స్కూల్ కరస్పాండెంట్ అక్కినేని కృష్ణకిషార్ తెలిపారు. బుధవారం స్కూల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విద్యార్థులను అభినందించారు. ఈనెల 24,25వ తేదీలలో తిరుపతిలోని శ్రీపద్మావతి మహిళ కళాశాలలో జరిగిన 27వ జాతీయ బాలల సైన్స్ రాష్ట్రస్థాయి పోటీల్లో స్కూల్ విద్యార్థులు అక్కినేని సాత్విక, నంద్యాల కావ్య విశేష ప్రతిభ కనబరిచి జాతీయస్థాయి పోటీలకు అర్హత సాధించారని తెలిపారు. పర్యావరణ వ్యవస్థ పై పండుగు ల ప్రభావం అనే అంశంపై చేసిన ప్రాజెక్ట్ ఎంపిక అయ్యిందని తెలిపారు. వచ్చే నెల 27 నుంచి జరిగే జాతీయస్థాయి బాలల సైన్స్ కాంగ్రెస్ పోటీలకు పాల్గొంటారని, వాటిలో గెలుపొందిన రెండు ప్రాజెక్ట్ లు 2020 జనవరి 3నుంచి 7 వరకు కర్ణాటకలోని యూనివర్శిటీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్స్ లో నిర్వహించే ఇస్కా ( ఇండియన్ సైన్స్ కాంగ్రెస్)కు అర్హత సాధిస్తాయని తెలిపారు. ప్రతిభ చాటిన విద్యార్థులు అక్కినేని సాత్విక, నంద్యాల కావ్యలను స్కూల్ ఉపాధ్యాయ బృందం అభినందించారు. కార్యక్రమంలో కృష్ణారావు, రమేష్, కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. 

You can share this post!

Wonderful Outdoors Experience: Eagle Spotting in Alaska

The only thing that overcomes hard luck is hard work