• India
homepagebanner
homepagebanner
homepagebanner
  • Police : 9440796632, 33, 34
  • Ambulance : 108
  • Fire-Brigade : 08816 233299
  • Municipal Corporation : 98499 05813
  • Blood Bank : 08816 225559
అఖిల భారత ట్రెక్కింగ్ శిబిరంకు ఎంపికైన యన్ సిసి కాడెట్లను అభినందించిన ఎమ్మెల్యే గ్రంధి (27/11/19)
Educational

అఖిల భారత ట్రెక్కింగ్ శిబిరంకు ఎంపికైన యన్ సిసి కాడెట్లను అభినందించిన ఎమ్మెల్యే గ్రంధి (27/11/19)

భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (27/11/19. 04.30pm)

ఈనెల 29వ తేదీ నుండి డిసెంబర్ 6వ తేదీ వరకు మహరాష్ట్రలోని కొల్లాపూర్ లో జరిగే యన్ సిసి అఖిల భారత ట్రెక్కింగ్ శిబిరంకు ఎంపికైన డిఎన్నార్ కళాశాల సీనియర్ డివిజన్ త్రృతీయ  సంవత్సరపు యన్ సిసి కాడెట్లు యల్ వరప్రసాద్, కె యుగంధర్ రావు,  జి ఉపేంద్ర, యస్ జగదీష్ కుమార్ లను ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ తన క్యాంపు కార్యాలయంలో అభినందించారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ భీమవరం  యన్  సిసి క్యాడెట్లు అఖిల భారత ట్రెక్కింగ్ క్యాంప్ కు ఎంపికవ్వటం అభినందనీయమనీ, యస్ సిసి ద్వారా సాహస కార్యక్రమాలు నిర్వహించి విద్యార్ధులను తీర్చి దిద్దటం గొప్ప విషయమనీ,  ఇటువంటి సాహసోపేతమైన క్యాంపులను సద్వినియోగం చేసుకొని భవిష్యత్తులో మానసిక శారీరక దృఢత్వాన్ని సాధించి త్రివిధ దళాల్లో చేరి దేశ సేవ చేయాలన్నారు.  కార్యక్రమంలో కళాశాల కార్యదర్శి గాదిరాజు సత్యనారాయణరాజు, ప్రిన్సిపాల్ యస్వి నరసింహరాజు, మాజీ టిటిడి బోర్డ్ సభ్యులు గోకరాజు రామరాజు, యన్.సి.సి. ఆఫీసర్ కెప్టెన్  డా.ఎ.వీరయ్య, చెరుకువాడ రంగసాయి తదితరులు పాల్గొన్నారు. 

You can share this post!

Wonderful Outdoors Experience: Eagle Spotting in Alaska

The only thing that overcomes hard luck is hard work