• India
homepagebanner
homepagebanner
homepagebanner
  • Police : 9440796632, 33, 34
  • Ambulance : 108
  • Fire-Brigade : 08816 233299
  • Municipal Corporation : 98499 05813
  • Blood Bank : 08816 225559
పట్టణంలో వైఎస్సార్ ఆసరా పధకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే గ్రంధి (2/12/19)
General

పట్టణంలో వైఎస్సార్ ఆసరా పధకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే గ్రంధి (2/12/19)

భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (02/12/19.. 04.30pm)

                    ఆరోగ్యశ్రీలో ఆపరేషన్లు చేయించుకుని తిరిగి అనారోగ్యం నుంచి కోలుకునే వరకు వారి భత్యం రూపంలో ఆదుకోవడానికి ముఖ్యమంత్రి జగన్ వైఎస్సార్ ఆసరా పధకాన్ని ప్రవేశపెట్టారని, ఈ పధకం అద్భుతమని ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ అన్నారు. ఏరియా ఆసుపత్రిలో ఈ పధకాన్ని అయన సోమవారం ప్రారంభించారు. రూ 1000 దాటినా వైద్యాన్ని ఆరోగ్యాశ్రీలో చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుందని, ఆసరా పధకంలో గరిష్టంగా రెండునెలలు వరకు ఆపరేషన్ లు చేయించుకున్న వారికీ రోజుకూ రూ 225 చొప్పున అందిస్తున్నామని అన్నారు. ఇంటివద్దనే ఉండి ఆరోగ్యం కోలుకునే వరకు ఈ మొత్త్తం వస్తుందని, దీనివల్ల రోగికి ఇంటివద్ద జీవన భృతి ఉంటుందని అన్నారు. నవరత్న పథకాల్లో భాగంగా ప్రజలను అన్ని విధాలుగా ఆదుకోవడానికి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని అన్నారు. అదే విధంగా ఏరియా ఆసుపత్రి ఆవరణలో భీమవరం మండల మాజీ ఇన్ ఛార్జ్ ఎంపిపి కొప్పర్తి వీర రాఘవుల ఆర్ధిక సహకారంతో నిర్మించిన పోలీస్ అవుట్ పోస్టును ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ప్రారంభించారు. కార్యక్రమంలో ఆసుపత్రి సూపరిండెంట్ వీరాస్వామి, సిఐలు విజయ్ కుమార్ రాయుడు, ఆళ్ల కృష్ణభగవాన్, కొప్పర్తి వీరరాఘవులు, ఆకుల సుబ్బలక్ష్మి, గాదిరాజు తాతారాజు, నాగేశ్వరరావు, సుంకర బాబురావు తదితరులు పాల్గొన్నారు. 

You can share this post!

Wonderful Outdoors Experience: Eagle Spotting in Alaska

The only thing that overcomes hard luck is hard work