• India
homepagebanner
homepagebanner
homepagebanner
  • Police : 9440796632, 33, 34
  • Ambulance : 108
  • Fire-Brigade : 08816 233299
  • Municipal Corporation : 98499 05813
  • Blood Bank : 08816 225559
దిశా హత్యకు నిరసనగా కళాశాల విద్యార్థులు ర్యాలీ    (2/12/19)
General

దిశా హత్యకు నిరసనగా కళాశాల విద్యార్థులు ర్యాలీ (2/12/19)

భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (02/12/19.. 04.30pm)

                                        మహిళలపై అత్యాచారాలు దాడులు చేసిన వారిని కఠినంగా శిక్షించే విధంగా చట్టాల్లో మార్పు తీసుకురావాలని భీమవరం ఎస్ఆర్ కెఆర్ ఇంజనీరింగ్ కళాశాల కార్యదర్శి సాగి విఠల్ రంగరాజు అన్నారు. డాక్టర్ ప్రియాంక రెడ్డిపై పాశవికంగా దాడిచేసి హత్యచేసిన సంఘటనకు నిరసనగా కళాశాల విద్యార్థుల ఆధ్వర్యంలో సోమవారం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ ఎం జగపతిరాజు మాట్లాడూతూ పోలీసులు, న్యాయవ్యవస్థ మహిళలపై అత్యాచారాలు చేసే దుర్మార్గులను కఠినంగా శిక్షించాలని కోరారు. కార్యక్రమంలో కళాశాల సీఈవో సాగి నిశాంత వర్మ, జెవి నరసింహరాజు, బంగారాజు, పి సత్యనారాయణరాజు, హరిమోహన్ తదితరులు పాల్గొన్నారు.               

                           మహిళలపై పైశాచిక దాడులను అరికట్టడంలో సమాజం సామాజిక బాధ్యతగా తీసుకోవాలని, రోజుకు ఏదొక ప్రాంతంలో మహిళలపై అత్యాచారాలు జరుగుతూనే ఉందని, ఈ దాడులను అరికట్టడంలో ప్రభుత్వాలు కృషి చేస్తున్నా ఫలితం శూన్యమని డిఎన్నార్ కళాశాల ప్రిన్సిపాల్ యు రంగరాజు అన్నారు. శ్రీవిజ్ఞానవేదిక ఆధ్వర్యంలో సోమవారం కళాశాల విద్యార్థులతో దిశా హత్యకు నిరసనగా ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ వర్మ, సూరిబాబు, హెచ్ వోడి రత్నం, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. 

You can share this post!

Wonderful Outdoors Experience: Eagle Spotting in Alaska

The only thing that overcomes hard luck is hard work