• India
homepagebanner
homepagebanner
homepagebanner
  • Police : 9440796632, 33, 34
  • Ambulance : 108
  • Fire-Brigade : 08816 233299
  • Municipal Corporation : 98499 05813
  • Blood Bank : 08816 225559
విద్యలో ప్రతిభ కలిగిన విద్యార్దులకు ఫీజులో పూర్తి రాయితీ (29/5/19)
Educational

విద్యలో ప్రతిభ కలిగిన విద్యార్దులకు ఫీజులో పూర్తి రాయితీ (29/5/19)

 
 
భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (29/5/19.. 04.30pm)
            పదవ తరగతి పరిక్షా ఫలితాలలో ప్రతిభ కనబరచి 90 శాతం పైగా మార్కులు సాధించిన విద్యార్దులకు దంతులూరి నారాయణరాజు కళాశాల పాలకవర్గం ఫీజు రాయితీ ప్రకటించింది. పదవ తరగతి లో 90 శాతం పైగా మార్కులు సాధించి డి.యన్.ఆర్ జూనియర్ కళాశాలలో ప్రదమ సంవత్సరం ఇంటర్మీడియేట్  లో ప్రవేశం పొందే విద్యార్దులకు నూటికి నూరు శాతం పీజు రాయితీని దంతులూరి నారాయణరాజు కళాశాల పాలకవర్గం, జూనియర్ కళాశాల  కోఆర్డినేటర్, కళాశాల పాలకవర్గ అసిస్టెంట్ సెక్రటరీ చేకూరి రామబద్రిరాజు సహకారంతో అందజేస్తున్నామని కళాశాల పాలకవర్గ అధ్యక్షులు గోకరాజు వెంకటనరసింహరాజు తెలిపారు.   ఇంటర్మీడియేట్ ప్రధమ సంవత్సంరంలో 90 శాతం మార్కులు సాధించినట్లయితే ద్వితీయ సంవత్సరంలో కూడా నూటికి నూరు శాతం ఫీజులో రాయితీ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. దంతులూరి నారాయణరాజు కళాశాల అసోసియేషన్ లోని విద్యాసంస్దలు లాభాపేక్ష లేకుండా పేద విద్యార్దులకు విద్యను అందించాలనే సదుద్దేశంతో ముందుకు నడుస్తుందని తెలిపారు.  రామబద్రిరాజు మాట్లాడుతూ డి.యన్.ఆర్ జూనియర్ కళాశాలలో విద్యార్దులకు 90 శాతం మార్కులు సాధించడానికి కృషిచేసిన అధ్యాపకులందరికీ గత విద్యాసంవత్సరం నుండి తాను స్వయంగా ఒక నెల జీతం బోనస్ గా ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో డి.యన్.ఆర్ కళాశాల ప్రిన్సిపాల్ యమ్ వి రఘుపతి రాజు, డి.యన్.ఆర్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్   యమ్.ఎ.అలీమ్, అద్యాపకులు చెల్లబోయిన రంగారావు తదితరులు పాల్గొన్నారు. 
 

You can share this post!

Wonderful Outdoors Experience: Eagle Spotting in Alaska

The only thing that overcomes hard luck is hard work