• India
homepagebanner
homepagebanner
homepagebanner
  • Police : 9440796632, 33, 34
  • Ambulance : 108
  • Fire-Brigade : 08816 233299
  • Municipal Corporation : 98499 05813
  • Blood Bank : 08816 225559
 పట్టణంలో ఇద్దరు క్రికెట్‌ బుకీల అరెస్టు
Crime

పట్టణంలో ఇద్దరు క్రికెట్‌ బుకీల అరెస్టు

 

 
భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (06/06/19.. 09.30am)
                భీమవరం ఒకటో పట్టణ పరిధిలోని 40 అడుగుల రోడ్డులో ఈ నెల 4న క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్వహిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు భీమవరం సీఐ పి.చంద్రశేఖర్‌రావు తెలిపారు. తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ఒంగురి కుమారస్వామి ఇంట్లో శ్రీలంక - అఫ్గానిస్థాన్‌ జట్ల మధ్య క్రికెట్‌ మ్యాచ్‌పై బెట్టింగ్‌ నిర్వహిస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు ఆకస్మిక తనిఖీలు చేశామని చెప్పారు. ఆ సమయంలో కుమార స్వామితో పాటు కొత్త శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.25 వేలు నగదు, ఎల్‌ఈడీ టీవీ, నాలుగు చరవాణులు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. రాజమహేంద్రవరంలోని బోలు సురేష్‌ అనే ప్రధాన బుకీతో బెట్టింగ్‌ నిర్వహిస్తున్నామని వారు చెప్పడంతో అతన్ని కూడా అరెస్టు చేయనున్నట్లు వివరించారు. కార్యక్రమంలో ఎస్సై డి.హరికృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు.

You can share this post!

Wonderful Outdoors Experience: Eagle Spotting in Alaska

The only thing that overcomes hard luck is hard work