• India
homepagebanner
homepagebanner
homepagebanner
  • Police : 9440796632, 33, 34
  • Ambulance : 108
  • Fire-Brigade : 08816 233299
  • Municipal Corporation : 98499 05813
  • Blood Bank : 08816 225559
 జిల్లా ఎస్పీగా నవదీప్‌సింగ్‌, రవిప్రకాష్‌ ఎస్‌ఐబీకి బదిలీ
Crime

జిల్లా ఎస్పీగా నవదీప్‌సింగ్‌, రవిప్రకాష్‌ ఎస్‌ఐబీకి బదిలీ

 
 
భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (06/06/19.. 09.30am)
               జిల్లా ఎస్పీగా నవదీప్‌ సింగ్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీకాకుళం ఎస్పీగా ఉన్న నవదీప్‌సింగ్‌ బదిలీపై ఇక్కడకు రానున్నారు. ఆయన ఎన్నికలకు ముందు మార్చి 19వతేదీన శ్రీకాకుళం ఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు.’ ఆయనను ఇక్కడకు బదిలీ చేశారు. 2015లో విజయనగరం జిల్లా పార్వతీపురం అదనపు ఎస్పీగా పనిచేశారు. అనంతరం పదోన్నతి లభించింది. 2016లో విజయనగరం జిల్లాగా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. అక్కడ సంవత్సర కాలం పనిచేసిన తరవాత ఇంటెలిజెన్సు విభాగానికి బదిలీపై వెళ్లారు. అక్కడ విధులు నిర్వహిస్తుండగా శ్రీకాకుళం ఎస్పీగా బదిలీపై వచ్చారు.
            పశ్చిమ ఎస్పీగా పనిచేస్తున్న ఎం రవి ప్రకాష్‌ను ఎస్‌ఐబీ ఎస్పీగా బదిలీ చేశారు. రెండేళ్లుగా జిల్లాలో శాంతిభద్రతలను కాపాడడంలో ఆయన విజయవంతమయ్యారనే చెప్పాలి. సార్వత్రిక ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించారు. ఎటువంటి అల్లర్లు లేకుండా ఈ ప్రక్రియ ప్రశాంతంగా జరిపారు. కేంద్రం తగినంత బలగాలను ఇవ్వకపోయినా ఉన్న వారినే సర్దుబాటు చేసి ముందస్తు ప్రణాళికతో విజయవంతంగా నిర్వహించారు. జిల్లాలో మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాల్లో ఆ జాడలు కనిపించకుండా తగిన చర్యలు చేపట్టారు. జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరానికి తగిన భద్రత కల్పించారు. గరగపర్రు, తుందుర్రు వంటి సున్నితమైన సమస్యలు దీర్ఘకాలికంగా కొనసాగినప్పటికీ వాటికి ప్రశాంత ముగింపు పలికారు.  

You can share this post!

Wonderful Outdoors Experience: Eagle Spotting in Alaska

The only thing that overcomes hard luck is hard work