• India
homepagebanner
homepagebanner
homepagebanner
  • Police : 9440796632, 33, 34
  • Ambulance : 108
  • Fire-Brigade : 08816 233299
  • Municipal Corporation : 98499 05813
  • Blood Bank : 08816 225559
ప్రపంచకప్‌లో భారత్‌ శుభారంభం .. దక్షిణాఫ్రికాపై విజయం
Cricket

ప్రపంచకప్‌లో భారత్‌ శుభారంభం .. దక్షిణాఫ్రికాపై విజయం

 
 
భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (06/06/19.. 09.30am)
                  బ్యాటింగ్‌ కష్టంగా ఉన్న పిచ్‌పై పట్టుదలతో నిలిచిన రోహిత్‌ శర్మ హీరోచిత శతకం చేసిన వేళ... విశ్వసమరంలో కోహ్లీసేన ఘనంగా బోణీ కొట్టింది. బూమ్‌ బూమ్‌ పేస్‌తో బుమ్రా, గింగిరాలు తిరిగే బంతులతో చాహల్‌ విజృంభించి విజయానికి గట్టి పునాది వేస్తే.. ఛేదనలో ఆద్యంతమూ క్రీజులో నిలిచి దక్షిణాఫ్రికా ఆశలను చిదిమేశాడు రోహిత్‌. అస్థిరతతో అనుమానాలు రేకెత్తించిన మిడిల్‌ ఆర్డరూ పరీక్షకు నిలిచి కప్పు ఆశలకు భరోసా ఇవ్వడమూ శుభసూచకమే.  ప్రపంచకప్‌లో భారత్‌కు అదిరే ఆరంభం. అన్ని రంగాల్లోనూ ఆధిపత్యాన్ని ప్రదర్శించిన కోహ్లీసేన బుధవారం జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాను మట్టికరిపించింది. చాహల్‌ (4/51), బుమ్రా (2/35), భువనేశ్వర్‌ (2/44) ధాటికి మొదట దక్షిణాఫ్రికా 9 వికెట్లకు 227 పరుగులే చేయగలిగింది. మోరిస్‌ (42; 34 బంతుల్లో 1×4, 2×6), రబాడ (31 నాటౌట్‌; 35 బంతుల్లో 2×4)ల ఎనిమిదో వికెట్‌ భాగస్వామ్యం ఆ జట్టుకు కాస్త పోరాడే స్కోరును అందించింది. రోహిత్‌ శర్మ (122 నాటౌట్‌; 144 బంతుల్లో 13×4, 2×6) సూపర్‌ శతకానికి ధోని (34; 46 బంతుల్లో 2×4), రాహుల్‌ (26; 42 బంతుల్లో 2×4)ల కీలక ఇన్నింగ్స్‌ తోడవడంతో లక్ష్యాన్ని భారత్‌... 47.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. రోహిత్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించింది. భారత్‌ తన తర్వాతి మ్యాచ్‌లో ఆదివారం ఆస్ట్రేలియాను ఢీకొంటుంది.
 
దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌: ఆమ్లా (సి) రోహిత్‌ (బి) బుమ్రా 6; డికాక్‌ (సి) కోహ్లి (బి) బుమ్రా 10; డుప్లెసిస్‌ (బి) చాహల్‌ 38; వాండెర్‌ డసెన్‌ (బి) చాహల్‌ 22; మిల్లర్‌ (సి) అండ్‌ (బి) చాహల్‌ 31; డుమిని ఎల్బీ (బి) కుల్‌దీప్‌ 3; ఫెలుక్వాయో (స్టంప్డ్‌) ధోని (బి) చాహల్‌ 34; మోరిస్‌ (సి) కోహ్లి (బి) భువనేశ్వర్‌ 42; రబాడ నాటౌట్‌ 31; తాహిర్‌ నాటౌట్‌ (సి) జాదవ్‌ (బి) భువనేశ్వర్‌ 0; ఎక్స్‌ట్రాలు 10 మొత్తం: (50 ఓవర్లలో 9 వికెట్లకు) 227; వికెట్ల పతనం: 1-11, 2-24, 3-78, 4-80, 5-89, 6-135, 7-158, 8-224, 9-227
బౌలింగ్‌: భువనేశ్వర్‌ కుమార్‌ 10-0-44-2; బుమ్రా 10-1-35-2; హార్దిక్‌ పాండ్య 6-0-31-0; కుల్‌దీప్‌ యాదవ్‌ 10-0-46-1; చాహల్‌ 10-0-51-4; జాదవ్‌ 4-0-16-0
 
భారత్‌ ఇన్నింగ్స్‌: ధావన్‌ (సి) డికాక్‌ (బి) రబాడ 8; రోహిత్‌ శర్మ నాటౌట్‌ 122; కోహ్లి (సి) డికాక్‌ (బి) ఫెలుక్వాయో 18; కేఎల్‌ రాహుల్‌ (సి) డుప్లెసిస్‌ (బి) రబాడ 26; ధోని (సి) అండ్‌ (బి) మోరిస్‌ 34; హార్దిక్‌ పాండ్య నాటౌట్‌ 15; ఎక్స్‌ట్రాలు 7 
మొత్తం: (47.3 ఓవర్లలో 4 వికెట్లకు) 230; వికెట్ల పతనం: 1-13, 2-54, 3-139, 4-213
 
బౌలింగ్‌: తాహిర్‌ 10-0-58-0; రబాడ 10-1-39-2; మోరిస్‌ 10-3-36-1; ఫెలుక్వాయో 8.3-0-40-1; శాంసి 9-0-54-0

You can share this post!

Wonderful Outdoors Experience: Eagle Spotting in Alaska

The only thing that overcomes hard luck is hard work