• India
homepagebanner
homepagebanner
homepagebanner
  • Police : 9440796632, 33, 34
  • Ambulance : 108
  • Fire-Brigade : 08816 233299
  • Municipal Corporation : 98499 05813
  • Blood Bank : 08816 225559
  అరకు అరవిరిసె   (03/6/19)
Life Style

అరకు అరవిరిసె (03/6/19)

 
 
భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (03/6/19.. 10.00am)
                  విశాఖపట్టణం నుంచి 30 కిలోమీటర్లు దాటాక తర్వాత అసలైన ప్రయాణం మొదలవుతుంది. ఓవైపు కొండలు.. ఇంకోవైపు లోయలు.. రివ్వున వీచే చల్లగాలి.. ప్రతి దృశ్యం మనోహరమే! ఈ వింతల నుంచి తేరుకోకముందే.. చిమ్మచీకటి కమ్మేస్తుంది. రైలు శబ్దంలో లయ మారుతుంది. అంతలోనే మళ్లీ వెలుగు.. ఇంతలోనే మళ్లీ చీకటి.. ఇలా చీకటివెలుగుల కౌగిలిలో ప్రయాణం సాగిపోతుంది. ఈ మార్గంలో బొద్దవర గ్రామం నుంచి కరకవలస వరకు 70 కిలోమీటర్ల దూరంలో 52 సొరంగాలు ఉంటాయి. 150 మీటర్ల నుంచి కిలోమీటర్‌ పొడవున్న సొరంగాలు కూడా ఉన్నాయి. వీటి గుండా రైలు దూసుకు పోతున్నప్పుడు ప్రయాణికుల కేరింతలు సొరంగాల్లో ప్రతిధ్వనిస్తాయి. ఇదే రైలులో అద్దాల బోగీ (విస్టాడోమ్‌) ఒకటుంటుంది. అందులో ప్రయాణం మరింత ఆనందంగా సాగుతుంది. ఈ బోగీలో ప్రయాణించాలంటే ముందస్తుగా టికెట్‌ బుక్‌ చేసుకోవాల్సిందే. అరకులోయకు వెళ్లే ప్రయాణికులు ముందుగా బొర్రా గుహలకు చేరుకుంటారు. సముద్రమట్టానికి 800 మీటర్ల ఎత్తున ఉండే ఈ గుహలు 150 మిలియన్‌ సంవత్సరాల కిందట ఏర్పడ్డాయని చెబుతారు. గుహల పైకప్పులోని సున్నపు రాయి కరిగి బొట్లుబొట్లుగా కింద పడి.. అందులోని నీరు ఆవిరై సున్నపురాయి మిగిలి విచిత్ర ఆకృతులు ఏర్పడ్డాయి. శివలింగం, తల్లీకూతుళ్లు, రాక్షసబల్లి వంటి రూపాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. బొర్రా గుహల నుంచి అరకు వెళ్లే దారిలో ప్రకృతి సౌందర్యం మనసును హత్తుకుంటుంది. చాలామంది ప్రైవేట్‌ ట్యాక్సీల్లో అరకు బాట పడతారు. వెళ్తూవెళ్తూ ముందుగా బొర్రాగుహలకు ఏడు కిలోమీటర్ల దూరంలోని కటికి జలపాతాన్ని సందర్శిస్తారు. ఇక్కడ గోస్తనీ నదీ జలాలు 50 అడుగుల ఎత్తు నుంచి దూకుతూ అలరిస్తాయి. దీనికి 18 కిలోమీటర్ల దూరంలోని తాడిగూడెం  జలపాతం కూడా సందర్శనీయ స్థలమే.

You can share this post!

Wonderful Outdoors Experience: Eagle Spotting in Alaska

The only thing that overcomes hard luck is hard work