• India
homepagebanner
homepagebanner
homepagebanner
  • Police : 9440796632, 33, 34
  • Ambulance : 108
  • Fire-Brigade : 08816 233299
  • Municipal Corporation : 98499 05813
  • Blood Bank : 08816 225559
 గోంగూర మటన్‌
Recipes

గోంగూర మటన్‌

 
 
భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (10/6/19..     04.30pm)
                 కావలసినవి 
మటన్‌ ముక్కలు: అరకిలో, ఉల్లిపాయలు: పావుకిలో, అల్లంవెల్లుల్లి: 2 టేబుల్‌స్పూన్లు, కారం: టేబుల్‌స్పూను, పసుపు: టీస్పూను, కొత్తిమీర: కట్ట, పుల్లగోంగూరకట్టలు: పది(సన్నవి), సోయకూర: 2 కట్టలు(సన్నవి), పచ్చిమిర్చి: ఆరు, నూనె: 50గ్రా., ఉప్పు: తగినంత.
 
తయారుచేసే విధానం
                   కడిగిన మటన్‌ముక్కల్ని కుక్కర్‌లో వేయాలి. ఉల్లిముక్కలు, నూనె, పచ్చి మిర్చిముక్కలు, కారం, అల్లంవెల్లుల్లి, ఉప్పు వేసి కలిపి, సుమారు పావులీటరు నీళ్లు పోసి నాలుగు విజిల్స్‌ రానివ్వాలి.తరవాత బాణలిలో వేసి, సోయకూర వేసి నీళ్లన్నీ ఆవిరైపోయేవరకూ వేయించాలి. మరో బాణలిలో గోంగూర ఆకులు వేసి ఉడికించి మెత్తని ముద్దలా చేసి, ఈ ముద్దను వేయిస్తోన్న మటన్‌లో వేసి మరో పది నిమిషాలు ఉడికించి, ఉప్పు సరిచూసి దించాక కొత్తిమీర తురుముతో అలంకరించాలి.   

You can share this post!

Wonderful Outdoors Experience: Eagle Spotting in Alaska

The only thing that overcomes hard luck is hard work